Champions Trophy 2025: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
చాంపియన్స్ ట్రోఫీ 2025ఆతిథ్యంపై ఉన్న అనిశ్చితి తొలగిపోయింది.ఐసీసీ అధికారికంగా ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనుందని ప్రకటించింది. భారత్ కోరినట్లుగా హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ జరగనుంది.2024-27 కాలంలో భారత్,పాకిస్థాన్‌లలో జరుగనున్న ఐసీసీ ఈవెంట్లు అన్ని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించబడతాయి. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ పాకిస్థాన్‌కు వెళ్లదు.భారత్ ఈ టోర్నీలో తటస్థ వేదికలో మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే,2025లో భారత్‌లో జరగనున్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్,2026లో నిర్వహించబడే టీ20 ప్రపంచ కప్ కూడా హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించబడతాయి. 2026లో టీ20ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నారు. పాకిస్థాన్ తమ మ్యాచ్‌లను భారత్ లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించనుంది.చివరగా,2028లో జరిగే మహిళల టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ పొందింది.