Page Loader
Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్-3లోకి దూసుకెళ్లిన మంధాన 
ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్-3లోకి దూసుకెళ్లిన మంధాన

Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్-3లోకి దూసుకెళ్లిన మంధాన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌ స్మృతి మంధాన ఇటీవలి ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో శతకంతో (112 పరుగులు) సత్తాచాటింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (771) సాధించి, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్‌ (774 పాయింట్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక షెఫాలీ వర్మ ఒక్క స్థానం మెరుగుపడి 13వ స్థానానికి చేరగా, జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ 12వ స్థానంలో కొనసాగుతోంది.

Details

16వ స్థానంలో రాధా యాదవ్

బౌలింగ్‌ విభాగంలో దీప్తి శర్మ, రేణుకా సింగ్‌లు ఒక్కొక్క స్థానం దిగజారి వరుసగా మూడో, ఆరో స్థానాల్లో నిలిచారు. మరో స్పిన్నర్ రాధా యాదవ్‌ 16వ స్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు టీ20ల్లో స్మృతి మంధాన అదే ఫామ్‌ కొనసాగిస్తే, టాప్‌ ర్యాంక్‌ను అధిగమించడం ఖాయం. ఇప్పటికే ఆమె వన్డేల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలి టీ20లో నాటింగ్‌హామ్‌ వేదికగా ఆమె శతకం బాదడంతో భారత్‌ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ 113 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌ ఘనవిజయం సాధించింది.

Details

dk

ఈ సెంచరీతో మంధాన మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. మూడు ఫార్మాట్లలో (వన్డే, టీ20, టెస్ట్‌) శతకాలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్రలో నిలిచింది. ఈరోజు (జులై 1) బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ మంధాన ఫామ్‌ కొనసాగిస్తే, ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరడం కేవలం సమయ ప్రశ్న మాత్రమే.