LOADING...
Smriti Mandhana: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో స్మృతి మంధాన
ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

Smriti Mandhana: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత మహిళల క్రికెట్ వన్డే కప్‌లో పలువురు టాప్ ప్లేయర్స్ ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ, మంధాన వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మంధాన స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తున్నది. దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ న్యూజిలాండ్‌పై సెంచరీ తర్వాత రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ నాల్గవ స్థానానికి చేరుకుంది.

Details

బౌలింగ్ విభాగంలో మొదటి స్థానంలో సోఫీ ఎక్లెస్టోన్ 

ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్ ఏడు స్థానాలు ఎగబాకి ఐదవ స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ వరుస అద్భుత ప్రదర్శనలతో ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. పాకిస్తాన్ ప్లేయర్ సిద్రా అమీన్ మూడు స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి ప్రవేశించింది. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్ 10లో దక్షిణాఫ్రికాకు చెందిన మారిజాన్ కాప్ ఐదో స్థానానికి ఎగబాకి, ఆస్ట్రేలియాకు చెందిన అలానా కింగ్ ఏడవ స్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ నాన్కులులెకో మ్లాబా ఆరు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరారు. ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకుంది.