Womens T20 World Cup 2023 Finalలోకి ఏడోసారి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఏడోసారి వరల్డ్ కప్ టీ20 ఫైనల్లోకి చేరుకుంది. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోరులో విజేతతో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లో జరుగుతుంది.
గతంలో జరిగిన అన్ని మహిళల T20 WCలో గ్రూప్ దశను క్లియర్ చేసిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
2010, 2012, 2014, 2010, 2020 ఎడిషన్లలో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. 2016 ఎడిషన్ ఫైనల్‌లో వెస్టిండీస్‌తో చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది.
మెగ్ లానింగ్
అస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్
ఆస్ట్రేలియా మహిళలు 43 మ్యాచ్‌లో 34 విజయాలను సాధించారు. వరల్డ్ కప్‌లో మరే ఇతర జట్టు 25 మ్యాచ్‌లను గెలవకపోవడం గమనార్హం.
ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ పోటీలో అత్యధిక పరుగులు 982 పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. సుజీ బేట్స్ (1,066) పరుగులు చేసి, ఆమె కంటే ముందు స్థానంలో ఉంది.
లానింగ్ 2014లో ఐర్లాండ్‌పై 65 బంతుల్లో 126 పరుగులు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల T20 వరల్డ్ కప్‌లో మొదటి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కింది.