Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.
గార్డనర్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. పది పరుగులు మాత్రమే వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ కు చేరింది.
గ్రూప్ బిలో తొలి స్థానంలో ఉనన్న ఇంగ్లండ్, గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తో రేపు తలపడనుంది. గెలిచిన జట్టు ఈ నెల 26న ఆస్ట్రేలియాతో ఫైనల్ లో ఆడనుంది.
టీమిండియా
కెప్టెన్ హర్మన్ ప్రీత్ రాణించినా ఫలితం లేదు
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 172/4 చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. బెత్ మూనీ అర్ధ సెంచరీతో రాణించింది. ఆసీస్ కెప్టెన్ లానింగ్ 34 బంతుల్లో 49* పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 28 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 34 బంతుల్లో 52 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 43 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ విజయం సాధిస్తుందని భావించగా.. హర్మన్ ప్రీత్ రనౌట్ అయింది. ఇంకా చివర్లో వరుసగా వికెట్లు పడటంతో చివరికి 5 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.