నేడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న ఇండియా
మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. టీమిండియా మహిళలు సెమీస్‌లో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనున్నారు. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 6.30గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరగనుంది. గ్రూప్ బిలో ఇండియాలో నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లను గెలుపొందింది. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లను గెలిచింది. గతంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల టీ20 ట్రాక్ రికార్డును చూస్తే.. భారత్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ లు జరగ్గా... ఆస్ట్రేలియా జట్టు నాలుగుసార్లు విజయం సాధించింది.
టీమిండియా గెలవాలంటే కష్టపడాల్సిందే..!
ఓపెనర్లగా షఫాలీ వర్మ, స్మృతి మంధాన బరిలోకి దిగనున్నారు. ఓపెనింగ్ లో వారు మంచి అరంభాన్ని అందిస్తే మిడిలార్డర్ వచ్చే జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ రాణించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆల్ రౌండర్లు దీప్తిశర్మ, దేవిక వైద్య, పూజా వస్త్రాకర్ రాణిస్తే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంటుంది. బౌలింగ్ విభాగంలో శిఖా పాండే, రాదాయాదవ్, రేణుకా సింగ్ రాణించాల్సిన అవసరం ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మహిళల టీ20 రికార్డును ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య 30 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 22 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్ జట్టు కేవలం ఆరు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది