Page Loader
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు
81 పరుగులతో అజేయంగా నిలిచిన స్కివర్-బ్రంట్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు సాధించింది. మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. స్కివర్-బ్రంట్ 81* పరుగులతో అజేయంగా నిలిచాడు. స్కివర్-బ్రంట్ 107 టీ20 మ్యాచ్‌ల్లో 26.68 సగటుతో 2,135 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలున్నాయి.

ఇంగ్లండ్

నాలుగు మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు

ఆఖరి లీగ్‌లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. డేనియల్ వ్యాట్ (59), నాట్ స్కివర్-బ్రంట్ (81*), బ్రంట్ తో పాటు ఓపెన‌ర్ వ్యాట్ 59 ర‌న్స్, అమీ జోన్స్ 47 ర‌న్స్ చేసి జ‌ట్టు స్కోర్ లో కీల‌క పాత్ర పోషించారు. లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 99/9 స్కోరు చేసి ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించింది. ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది.