Page Loader
టీ20ల్లో పాకిస్తాన్ మహిళా ప్లేయర్ అదరిపోయే రికార్డు
మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిదాదార్

టీ20ల్లో పాకిస్తాన్ మహిళా ప్లేయర్ అదరిపోయే రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్తాన్ మహిళా స్టార్ ప్లేయర్ నిదాదార్ అరుదైన రికార్డును సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిదాదార్ చరిత్రకెక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఓ వికెట్ నిదాదార్ పడగొట్టి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన అనిసా మహ్మద్‌ పేరిట ఉండగా ప్రస్తుతం నిదాదార్ అధిగమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 114 పరుగుల తేడాతో ఓడిపోయింది. మహిళల టీ20ల్లో 100కి పైగా వికెట్లు సాధించిన ఏకైక పాకిస్థానీ మహిళగా నిదాదార్ నిలిచింది.

పాకిస్తాన్

ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమి

మే 2010లో శ్రీలంకపై నిదా మహళల టీ20ల్లో అరంగేట్రం చేసింది. పది సంవత్సరాల పాటు 130 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లను పడగొట్టింది. అటు బ్యాటింగ్‌లో నిదా 1,687 పరుగులు చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 213/5 భారీ స్కోరు చేసింది. డేనియల్ వ్యాట్ (59), నాట్ స్కివర్-బ్రంట్ (81*), అమీ జోన్స్ (47) పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోరును అందించారు. లక్ష్య చేధనకు పాకిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 99 పరుగులను మాత్రమే చేసింది.