Page Loader
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్
49 బంతుల్లో 56 పరుగులు చేసిన సుజీబేట్స్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ అద్భుత ఫర్మామెన్స్ అదరగొడుతోంది. 102 పరుగులతో తేడాతో శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సుజీబేట్స్ 49 బంతుల్లో 56 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఎనిమిది సార్లు అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా సుజీబేట్స్ నిలిచింది. పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు బెర్నాడిన్ బెజుడెన్‌హౌట్ (32), బేట్స్ 46 పరుగులు జోడించి న్యూజిలాండ్‌కు శుభారంభాన్ని అందించారు. బెజుడెన్‌హౌట్ ఔట్ అయిన తర్వాత బేట్స్, అమేలియా రెండో వికెట్‌కు 110 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సుజీబేట్స్

సుజీబేట్స్ సాధించిన రికార్డులివే

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో సుజీబేట్స్ 36 మ్యాచ్‌లు ఆడి 1066 పరుగులు చేసింది. 143 టీ20 మ్యాచ్‌లు ఆడి 29.61 సగటుతో 3,820 పరుగులు చేసింది. ఇందులో 25 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది. మహిళల T20Iలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా బేట్స్ చరిత్రకెక్కింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 149 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. బేట్స్ 143 మ్యాచ్ లను ఆడింది. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 162/3 స్కోరు చేసింది. శ్రీలంక 60 పరుగులకే ఆలౌటైంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం.