ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైన భారత్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మహిళలు అదరగొడుతున్నారు. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటింది. ప్రస్తుతం రేపు ఇంగ్లండ్ జరుగనున్న టీ20 పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌లో గెలిచి ఇప్పటికే టీమిండియా మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇంగ్లండ్ కూడా ఇదే రీతిలో రాణిస్తోంది. అయితే రేపటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది. డబ్ల్యూటీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌కు 7-19 గెలుపు-ఓటమి రికార్డు ఉంది. బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్ సెమీ-ఫైనల్‌లో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది.
ఇరు జట్లలోని సభ్యులు
పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ పేసర్లు, స్పిన్నర్లు ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో సాయత్రం 6.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్-కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్. ఇంగ్లండ్ : డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, అలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ బ్రంట్, హీథర్‌నైట్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్-కీపర్), సోఫీఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, కేథరిన్ స్కివర్ బ్రంట్, సారా గ్లెన్, లారెన్ బెల్.