Page Loader
ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్
బ్యాటర్ల జాబితాలో 20వ స్థానంలో కొనసాగుతున్న రిచా ఘోస్

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2023
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడాకారిణి రిచా ఘోష్ కెరీర్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా మహిళా ప్లేయర్ రిచా ఘోస్ సత్తా చాటింది. తాజాగా ప్రకటించిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌ ర్యాంకింగ్స్‌లో 572 పాయింట్లను సాధించింది. దీంతో ఆమె 20 స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్లలో పాకిస్థాన్‌కు చెందిన నిదా దార్ రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో ఉంది. 2023 ICC మహిళల T20 ప్రపంచకప్‌లో ఘోష్ టీమిండియా మహిళల తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచింది.

రిచా ఘోస్

ఆల్ రౌండర్‌ జాబితాలో ఆష్లీ గార్డనర్

2023 ICC మహిళల T20 ప్రపంచకప్‌లో ఘోష్ టీమిండియా మహిళల తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచింది. టీ20ల్లో ఆమె వరుసగా 31*, 44*, 47*, 0 పరుగులు చేసింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఘోష్ 16 స్థానాలు ఎగబాకి 20వ నిలవడం గమనార్హం. బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ డార్సీ బ్రౌన్ 10 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీ గార్డనర్ నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా కొనసాగుతోంది.