LOADING...
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా
భారత్ 20 ఓవర్లలో 155/6 పరుగులు చేసింది

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం. 2018, 2002లలోనూ సెమీఫైనల్‌కి చేరిన ఇండియా, 2020 ఫైనల్ లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. స్మృతిమంధాన 87 పరుగులు చేసి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత ఓపెనర్లు షఫాలీవర్మ, మంధాన 62 పరుగులు జోడించారు. హర్మన్‌ప్రీత్‌కౌర్ 13 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్ డెలానీ మూడు వికెట్లు తీశాడు.

గెలుపు

5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

దీంతో వర్షం పడటంతో మ్యాచ్ సాధ్యం కాలేదు. అయితే అప్పటికి ఐర్లాండ్ డీఎల్ఎస్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉంది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో అదే 5 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. మంధాన టీ20 కెరీర్‌లో 2800 పరుగులు చేసిన ఆరో ప్లేయర్‌గా నిలిచింది. టీ20ల్లో మొత్తం 22 అర్ధశతకాలను నమోదు చేసింది. ICC మహిళల T20 వరల్డ్ కప్‌లో మంధాన 23.52 సగటుతో 447 పరుగులు చేయడం గమనార్హం. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20ల్లో 3,000 పరుగులను సాధించింది. ఫార్మాట్‌లో పరుగుల పరంగా ఆమె సుజీ బేట్స్ (3,820), మెగ్ లానింగ్ (3,346), సారా టేలర్ (3,166) వంటి వారి సరసన చేరింది.