LOADING...
Dubai Tournament: టెన్నిస్ స్టార్‌లకు షాక్.. దుబాయ్ టోర్నీపై వివాదం
టెన్నిస్ స్టార్‌లకు షాక్.. దుబాయ్ టోర్నీపై వివాదం

Dubai Tournament: టెన్నిస్ స్టార్‌లకు షాక్.. దుబాయ్ టోర్నీపై వివాదం

వ్రాసిన వారు Moogati Shabari
May 23, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్‌ క్రీడాకారిణులు అరినా సబలెంక, ఇగా స్వైటెక్‌లు గాయాలయ్యాయి. తీవ్రమైన షెడ్యూల్‌ ఒత్తిడుల కారణంగా దుబాయ్ టోర్నమెంట్‌ నుంచి తప్పుకోవడంతో వివాదం నెలకొంది. ఈ నిర్ణయంపై టోర్నీ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేయగా, ముఖ్యంగా టోర్నీ డైరెక్టర్ సలాహ్ తహ్లాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి క్షణంలో టోర్నీ నుంచి వైదొలిగినందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లపై జరిమానాలు విధించడమే కాకుండా, వారి ర్యాంకింగ్ పాయింట్లను కూడా తగ్గించాలని సూచించారు.

వివరాలు

స్వైటెక్ అసహనం..

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇగా స్వైటెక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, వ్యక్తిగత షెడ్యూల్‌ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. టోర్నీ నుంచి తప్పుకోవడంపై ఫిర్యాదులు వచ్చిన విషయం తమకు తెలిసిందని, అయితే శిక్షల గురించి వినడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. "మాకు అవసరమైతే టోర్నీల నుంచి తప్పుకునే స్వేచ్ఛ ఉంది. అందులో తప్పేమీ లేదు. మేము బానిసలు కాదు" అంటూ స్వైటెక్ అసహనం వ్యక్తం చేశారు.

వివరాలు

టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాయింట్ల కోత..

అలాగే టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల ర్యాంకింగ్ పాయింట్లలో కోత విధించబడుతుందని, అదే క్రీడాకారులకు ఇప్పటికే పెద్ద నష్టమని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రపంచ టెన్నిస్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన స్వైటెక్, సబలెంకలు త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో పోటీపడనున్నారు. ఇగా స్వైటెక్ ఇప్పటికే 2020, 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మరోవైపు అరినా సబలెంక మాత్రం ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు.

Advertisement