Loading...
Suresh Raina: 'ఇంపాక్ట్‌ రూల్‌'తో ఫిట్‌ ప్లేయర్లకు అన్యాయం.. సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు
ఇంపాక్ట్‌ రూల్‌'తో ఫిట్‌ ప్లేయర్లకు అన్యాయం.. సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు

Suresh Raina: 'ఇంపాక్ట్‌ రూల్‌'తో ఫిట్‌ ప్లేయర్లకు అన్యాయం.. సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంపాక్ట్‌ రూల్‌పై క్రికెట్‌ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నిబంధనను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కూడా ఇప్పటికే చర్యలను ముమ్మరం చేసింది. కొందరు ఈ రూల్‌కు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు దీనివల్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌ మధ్య సమతుల్యత దెబ్బతింటోందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కూడా ఇంపాక్ట్‌ రూల్‌ కారణంగా బ్యాటింగ్‌ చేసిన తర్వాత బెంచ్‌కే పరిమితమవుతున్నారని తెలిపాడు. 'ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ రూల్‌కు నేను వ్యతిరేకం. ఎందుకంటే చాలా మంది ఫిట్‌ ప్లేయర్లు కూడా బ్యాటింగ్‌ చేసేసి ఊరుకుంటున్నారు.

వివరాలు

వరల్డ్‌ కప్‌లోనూ ఇలాంటి రూల్‌ లేదు

ఇలా చేస్తే వారిలో నైపుణ్యాలు ఎలా మెరుగవుతాయి? వరల్డ్‌ కప్‌లోనూ ఇలాంటి రూల్‌ లేదు. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడానికి దీనిని తీసుకొచ్చారని నేను అర్థం చేసుకోగలను.

కానీ, బౌలర్లకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నిబంధన వల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం లేదు. గతంలో 170 పరుగులు అంటేనే మంచి స్కోరు. ఇప్పుడు 250 పరుగులైనా సులభంగానే ఛేదిస్తున్నారు.

300 పరుగులను కూడా కొట్టేసేలా పరిస్థితి ఉంది. బౌలర్లకు ఇది పీడకలగా మారుతోంది. వికెట్‌ తీయడానికి ఆప్షన్లే ఉండటం లేదు.

అదనంగా ఒక బ్యాటర్‌ ఉండటంతో దూకుడుగా ఆడుతూ బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని రైనా తెలిపాడు. 2023 సీజన్‌లో బీసీసీఐ తొలిసారి ఇంపాక్ట్‌ రూల్‌ను అమలు చేసింది.

వివరాలు

ఇప్పుడే వద్దు..

భారత ఆటగాళ్లను బిగ్‌బాష్‌, ద హండ్రెడ్‌ వంటి విదేశీ లీగ్‌లకు అనుమతించాల్సిన అవసరం లేదని రైనా అభిప్రాయపడ్డాడు.

'భారత ఆటగాళ్లను బిగ్‌బాష్‌, ద హండ్రెడ్‌ టోర్నీలకు అనుమతించక్కర్లేదు.

ఇప్పుడు మన లీగే పెద్దది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పర్యటనలకు వెళ్లినప్పుడు నేను కూడా అక్కడి లీగ్‌ల్లో ఆడేందుకు ఆసక్తి చూపించా. కానీ, ఇప్పుడు మన ఐపీఎల్‌లోనే ఆడేందుకు విదేశీ ప్లేయర్లు ఉత్సాహపడుతున్నారు.

అలాంటప్పుడు మనం ఆ లీగ్‌ల్లో ఆడాల్సిన అవసరం లేదు'' అని రైనా పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ధోని షాక్‌ అయ్యాడు..

ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలోనే సురేశ్‌ రైనా కూడా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

తొలుత తాను ఈ విషయం చెప్పినప్పుడు ధోని షాక్‌కు గురైనట్లు రైనా తాజాగా వెల్లడించాడు. 'క్రీడల్లో ఏదొక రోజు వీడ్కోలు చెప్పాలి.

దేశం కోసం ఆడాం. అందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆటకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందని నాకు అప్పుడు అనిపించింది.

కుటుంబంతో కలిసి గడపాల్సిన అవసరం ఉంది. నాకు అప్పుడు 33 ఏళ్లు అనుకుంటా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని ఉన్నప్పుడు వెళ్లి 'కెరీర్‌ ముగిసింది' అని అన్నా. ఆ మాటలకు ధోని ఒక్కసారిగా కలవరానికి గురయ్యాడని నాటి ఘటనను రైనా గుర్తు చేసుకున్నాడు.

ADVERTISEMENT