LOADING...
IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్
109 పరుగులకు టీమిండియా ఆలౌట్

IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టులో ఆసీస్ ను ఓడించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియా.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకి విలవిలలాడిపోయింది. దీంతో 33.2 ఓవర్లలోనే టీమిండియా 109 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్ 5 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి టీమిండియా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు తీయగా, చివరి వికెట్ సిరాజ్ (0) రనౌట్ అయ్యాడు.

టీమిండియా

చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు

విరాట్‌ కోహ్లీ (22), శుభ్‌మన్‌ గిల్‌ (21), ఉమేశ్‌ యాదవ్‌ (17 ) శ్రీకర్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌ (12), రోహిత్‌ శర్మ (12) దారుణంగా విఫలమయ్యారు. మిగిలిన ప్లేయర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఛతేశ్వర్ పుజారా ఒక్క పరుగుకే ఔట్ కాగా, రవీంద్ర జడేజా నాలుగు పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఫలితంగా 109 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. కోహ్లీ టెస్టు సెంచరీ లేకుండానే 40 ఇన్నింగ్స్‌లు ఆడడం గమనార్హం. గత 14 ఇన్నింగ్స్‌లలో 50 పరుగుల మార్కును కూడా కోహ్లీ టచ్ చేయలేకపోయాడు. కోహ్లీ 107 టెస్టుల్లో 48.34 సగటుతో 8,217 పరుగులు చేశాడు.