NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
    తదుపరి వార్తా కథనం
    IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది

    IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2023
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

    ఎలాగైనా మూడో టెస్టులో నెగ్గాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరం కావడంతో స్మిత్ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.

    ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, కమిన్స్‌ల స్థానంలో కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్‌లకు చోటు లభిచింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ స్థానంలో శుభ్‌మన్ గిల్, ఉమేష్ యాదవ్‌లు వచ్చారు.

    టీమిండియా

    ఇరు జట్లలోని సభ్యులు

    ఈ స్టేడియంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉదయం 9.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్-కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

    ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI). ): ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్-కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్
    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం

    టీమిండియా

    రాయపూర్ వన్డేలో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు, కివీస్ 108 ఆలౌట్ క్రికెట్
    హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ హకీ ప్రపంచ కప్
    ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం క్రికెట్
    వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం క్రికెట్

    క్రికెట్

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించని స్టీవెన్ స్మిత్ స్టీవన్ స్మిత్
    ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ ఇంగ్లండ్
    కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం టీమిండియా
    దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025