ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్.. మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ సిద్ధం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు కామెరాన్ గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మూడో టెస్టు కోసం తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చెప్పాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1న మూడో టెస్టు ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టుల్లో కేవలం నలుగురు బౌలర్లను బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ రాకతో జట్టు బలం పుంజుకుంది. 2022 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కామెరాన్ గ్రీన్ వేలికి గాయమైన విషయం తెలిసిందే.
మూడో టెస్టులో గ్రీన్, మిచెల్ స్టార్క్ ఆడే అవకాశం
తాను రెండో టెస్టుకు దాదాపు అందుబాటులో ఉన్నాననీ, ముందుజాగ్రత్త చర్యల కారణంగా ఆడలేదని గ్రీన్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయం తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిందని చెప్పాడు. డిసెంబర్ 2020లో టెస్టులో అరంగేట్రం చేసిన గ్రీన్ 18 టెస్టుల్లో 806 పరుగులను కలిగి ఉన్నాడు. ఇందులో అరు అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 23 వికెట్లను పడగొట్టాడు. ముఖ్యంగా గ్రీన్ 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. మూడో టెస్టులో గ్రీన్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడే అవకాశం ఉంది.