ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫిట్ నెస్ సమస్యల కారణంగా హేజిల్‌వుడ్ ఈ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. వరుస పరాజయాలను చవిచూస్తున్న ఆసీస్ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటర్లు హడలెత్తిపోతున్నారు. మొదటి జరిగిన రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిసిపోవడం గమనార్హం.
సహచరుల నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు
ఇలాంటి సమయంలో తాను ఇండియాకు రాకూడదని నిర్ణయించుకున్నానని, తాను ప్రస్తుత పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండాలని అనుకుంటున్నానని, తన సహచరుల నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలని పాట్ కమిన్స్ పేర్కొన్నారు. 2011లో నవంబర్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కమిన్స్ 49 టెస్టుల్లో 217 వికెట్లు పడగొట్టాడు. 2021 చివర్‌లో కమిన్స్ టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన తర్వాత స్మిత్ రెండుసార్లు టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించాడు. రెండు సందర్భాల్లోనూ ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది మొత్తంమీద స్మిత్ 36 టెస్టులకు నాయకత్వం వహించి 20 విజయాలను అందుకున్నాడు.