Page Loader
మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా
మూడో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా

మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ వేదికపై ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో రెండుసార్లు భారత్ విజేతగా నిలిచింది. 2016లో న్యూజిలాండ్‌ను 321 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. కోహ్లీ డబుల్‌సెంచరీ (211)తో రాణించాడు. అశ్విన్ 13 వికెట్లు తీసి సత్తాడు. 2019లో బంగ్లాదేశ్‌ను 130 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. మయాంక్అగర్వాల్ 243 రాణించడంతో టీమిండియా విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు పడగొట్టాడు.

ఇండోర్

ఇండోర్‌లో టీమిండియాకు మంచి రికార్డు

ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది. ఇండోర్‌లో ఆడిన ఆరు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ (రెండుసార్లు), ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లను భారత్ ఓడించింది. అప్పట్లో ఈ మైదానంలో వన్డేలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు. గత నెలలో న్యూజిలాండ్‌పై ఈ వేదికలో రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) పరుగులు చేసి చెలరేగిపోయారు. రోహిత్ శర్మ 2017లో ఈ స్డేడియంలో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.