బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించని స్టీవెన్ స్మిత్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ రాణించడం లేదు. ఢిల్లీలో జరిగిన టెస్టులో 0, 6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.
దీంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. స్మిత్ మిగిలిన రెండు టెస్టులో రాణించాలని ఆస్ట్రేలియా ప్లేయర్లు భావిస్తున్నారు. టీమిండియాపై స్మిత్ కు మంచి రికార్డు ఉంది. టెస్టులో అత్యత్తుమ బ్యాటర్‌గా స్మిత్ ఎదిగాడు.
భారతదేశంలో, స్మిత్ ఎనిమిది టెస్టులు ఆడి 52.21 సగటుతో 731 పరుగులు చేశాడు. 2013 సిరీస్‌లో రెండు టెస్టుల్లో 161 పరుగులు చేశాడు. 2017 పర్యటనలో 499 పరుగులు చేశాడు, గతంలో పూణేలో జరిగిన టెస్టులో సెంచరీలతో అదరగొట్టాడు.
స్టీవెన్ స్మిత్
స్మిత్ సాధించిన రికార్డులివే
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ కేవలం 71 పరుగులు చేయడం గమనార్హం. అతని స్కోర్లు వరుసగా 37, 25*, 0, 9 పరుగులు చేశాడు.
వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై చేతిలో ఎనిమిది సార్లు స్మిత్ ఔట్ అయి చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. అశ్విన్‌పై స్మిత్ 23 ఇన్నింగ్స్‌లలో 421 పరుగులు చేశాడు.
భారత్‌పై 16 టెస్టులాడిన స్మిత్ 1,813 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలున్నాయి. భారత్ పై ఎనిమిది టెస్టు చేసిన రికి పాటింగ్ రికార్డును స్మిత్ సమం చేశాడు.
2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన స్మిత్ 94 టెస్టుల్లో 8,718 పరుగులు చేశాడు.