Page Loader
మేజర్ లీగ్ క్రికెట్ ఆడనున్న స్టీవెన్ స్మిత్
స్మిత్ బిబిఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు

మేజర్ లీగ్ క్రికెట్ ఆడనున్న స్టీవెన్ స్మిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2023
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ వచ్చే ఏడాది అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ ను ఆడనున్నారు. స్మిత్ అమెరికన్ T20 టోర్నమెంట్, మేజర్ లీగ్ క్రికెట్ యజమానులతో ఇప్పటికే రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది జూలైలో ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌ టెక్సాస్, నార్త్ కరోలినాలో మూడువారాల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో స్టీవెన్ స్మిత్ ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లను రికార్డును బద్దలు కొట్టాడు. ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో రెండు శతకాలను సాధించాడు. తాము స్టీవెన్ స్మిత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, స్మిత్ US లో క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతున్నాడని MLC సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా అన్నారు.

స్టీవ్ స్మిత్

బిగ్‌బాష్ లీగ్ లో రెండు సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్

బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం స్మిత్ ఇండియాలో ఆస్ట్రేలియా జట్టుతో ఉన్నాడు. సిరీస్‌కు ముందు, బిగ్ బాష్ లీగ్ లో రెండు సెంచరీలను కొట్టాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో స్మిత్‌కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 240 టీ20లు ఆడి 5150 పరుగులు చేశారు. ఆరు జట్ల మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జూలై 13 నుండి ప్రారంభం కానుంది. డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ DC, సీటెల్, న్యూయార్క్‌ ఫ్రాంచైజీలగా ఏర్పడ్డాయి. ఈ నెల ప్రారంభంలో, క్రికెట్ న్యూ సౌత్ వేల్స్ MLCతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అమెరికన్ ఆటగాళ్లను మేజర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఆసీసీ క్రికెట్ బోర్డు అనుమతిచ్చింది.