Page Loader
ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..!
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గాయపడ్డ వార్నర్

ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. గాయల బెడద కారణంగా స్టార్ ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాడు. ఇప్పటికే పేసర్ జోష్ హేజిల్ వుడ్ మిగతా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కామిన్స్ సిడ్ని వెళ్లాడు. ఇక హెయిర్ లైన్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న డేవిడ్ వార్నర్ మిగతా మ్యాచ్‌లు ఆడటం సందేహంగా మారింది. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయపడ్డ విషయం తెలిసిందే. వార్నర్ మూడో టెస్టు ఆడటంపై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు.

డేవిడ్ వార్నర్

వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్..!

భారత్‌తో జరిగే మూడో టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ ఆడతాడా లేదా అనే విషయంపై మేనేజ్‌మెంట్‌ ఇంకా తొందరపడటం లేదని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. వార్నర్ ఇంకా గాయంతో బాధపడుతున్నాడని, అతను అందుబాటులో లేకుంటే ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. రెండో టెస్టు ఆడుతున్న వార్నర్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ గాయపడ్డారు. దీంతో వార్నర్ స్థానంలో ఫీల్డిండ్ చేయడానికి మాథ్యూ రెన్‌షా మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం బోర్డర్‌-గావస్కర్‌ సిరీసులో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. నాలుగు టెస్టుల సిరీసులో 2-0తో ముందంజలో ఉంది