Page Loader
ఆస్ట్రేలియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ దూరం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌కు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ దూరం

ఆస్ట్రేలియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్ ఇప్పటికే రెండో టెస్టులో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద ఎక్కువ అవుతోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు స్టార్ పేసర్లు మిచెల్‌స్టార్క్, జోష్‌హేజిల్‌వుడ్ దూరం కాగా.. తాజాగా అందించిన సమాచారం మేరకు హేజిల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలిసింది. తొలి రెండు టెస్టులుక కూడా ఆతడు గాయం కారణంగా ఆడని విషయం తెలిసిందే. ఓపెనర్ వార్నర్, స్పిన్నర్ ఆస్టన్ అగార్, మ్యాట్ రెన్షా స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. ఒక్కో ప్లేయర్ టీమ్‌కు దూరమవుతుండటంతో ఆస్ట్రేలియా పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.

హాజిల్‌వుడ్

వన్డే సిరీస్‌కు హాజిల్‌వుడ్ దూరం..?

గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిడ్నీ టెస్టులో హాజిల్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. హాజిల్‌వుడ్ గత రెండేళ్లలో కేవలం నాలుగు టెస్టులను మాత్రమే ఆడాడు. మార్చి 17న జరిగే వన్డే సిరీస్ లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో హజిల్‌వుడ్ ఆడాడు. హేజిల్‌వుడ్ డిసెంబర్ 2014లో భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీశాడు. అతను ఇప్పటివరకు 59 టెస్టులు ఆడాడు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అత్యవసరంగా సిడ్నీకి బయల్దేరిన విషయం తెలిసిందే.