IND vs AUS, 2nd Test: విరాట్ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. బంతికి బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్‌కి తాకినట్లు రిప్లైలో కనిపిస్తున్నా కోహ్లీ ఔట్ అంటూ ప్రకటించారు. దీనిపై థర్డ్ ఆంపైర్ కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం గమనార్హం.
దీంతో భారత్ మాజీ కెప్టెన్ మాజీ కెప్టెన్ 84 బంతుల్లో 44 స్కోరు పెవిలియన్‌కు వెళ్లాడు. దీనిపై నెటిజన్లు ఘాటుగా ఆంపైర్లపై విమర్శలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు.
కోహ్లీ
నిరాశతో మైదానాన్ని వదిలిన కోహ్లీ
ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్ కోహ్లీ బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్, ప్యాడ్‌ని ఒకేసారి తాకినట్లు కనిపించింది. దీంతో ఎల్బీడబ్ల్యూ ఆస్ట్రేలియా టీం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఓట్ అని ప్రకటించాడు.
కానీ బంతిని బ్యాట్ తాకిందని ధీమా వ్యక్తం చేసిన కోహ్లీ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. అయితే రిప్లైలో బంతి తొలుత బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్ కు తగినట్లు కనిపించింది. దీంతో థర్డ్ ఆంపైర్ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయాడు.
ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించడంతో కోహ్లీ నిరాశతో మైదానాన్ని వదిలాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.