విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ
టెస్టు క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కన్నా అత్యధిక సిక్స్ లు బాదిన బ్యాటర్ మహ్మద్ షమీ నిలిచాడు. టెస్టులో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ టెస్టులో 24 సిక్సర్లు కొట్టగా.. మహ్మద్ షమీ 25 సిక్స్ లు కొట్టాడు. నాగ్ పూర్ జరిగిన మొదటి టెస్టులో మహ్మద్ షమీ మూడు సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించాడు. మూడో రోజు ప్రారంభంలో రవీంద్ర జడేజా 70 అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి దిగిన షమీ, అక్షర్‌తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
107 సిక్సర్లు కొట్టిన బ్రెండన్ మెకల్లమ్
చివర్లో షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. మహ్మద్ వచ్చి రాగానే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా టాడ్ మర్ఫీ బౌలింగ్ వరుసగా రెండు సిక్సర్లు బాది సత్తా చాటాడు. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2004 దక్షిణాఫ్రికాపై టెస్టులో అరంగేట్రం చేసిన మెకల్లమ్ 101 టెస్టులో 107 సిక్సర్లు కొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ 104 మ్యాచ్‌ల్లో 91 సిక్సర్లు కొట్టి ఆరోస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 374 మ్యాచ్‌లు ఆడిన సెహ్వాగ్ 243 సిక్సర్లు కొట్టాడు