Page Loader
టీమిండియాకి  పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం
బుమ్రా టెస్టులో 128 వికెట్లు పడగొట్టాడు

టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ ఉన్నందున బోర్డర్ గవాస్కర్ ట్రోఫికి దూరమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించాలంటే కనీసం 3-0తో విజయం సాధించాలి. వెన్ను సమస్యల కారణంగా బుమ్రా గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

బుమ్రా

వన్డేలకు బుమ్రా ఎంట్రీ ఇచ్చేనా..?

టెస్ట్ లెగ్ ముగిసిన తర్వాత భారత్ ఆసీస్‌తో మూడు వన్డేలను ఆడనుంది. అయితే బుమ్రా ఆసీస్ వన్డే సిరీస్ ఎంట్రీ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే. జనవరి 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా అన్ని ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. 30 మ్యాచ్‌లో 21.99 సగటుతో 128 వికెట్లు పడగొట్టాడు. కేవలం నాలుగు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. బుమ్రా లేకపోవడం జట్టుకు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు దశాబ్ద కాలంగా స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత్‌ తరఫున కీలకంగా వికెట్లు పడగొట్టారు. ఇప్పటివరకూ సిరాజ్, షమీ, ఉనద్కత్, ఉమేష్‌యాదవ్ రూపంలో ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం బలంగా ఉంది.