Page Loader
అంపైర్ నితిన్ మీనన్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
అంపైర్ నితిన్ మీనన్ తప్పిదాలపై విమర్శలు

అంపైర్ నితిన్ మీనన్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోర్ టెస్టులో అంపైర్ నితిన్ మీనన్ ఘోర తప్పిదాలు చేశారు. తొలి టెస్టులో ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చినప్పటికీ అంపైర్ స్పందించలేదు. అదే ఓవర్లో నాలుగో బంతికి స్కార్ట్క్ ఎల్బీ కోసం అపీల్ చేయగా.. అంపైర్ అడ్డంగా తల ఊపాడు. కోహ్లీ ఎల్బీ విషయంలో అంపైర్ సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో విరాట్ ఫ్యాన్స్ అంపైర్‌పై ఫైర్ అవుతున్నారు. అంపైన్ నితిన్ మీనన్ తప్పిదంతో పాటు ఆసీస్ రివ్యూ తీసుకోకపోవడంతో రోహిత్ శర్మకు తొలి ఓవర్‌లోనే రెండు అవకాశాలు లభించాయి. కానీ ఆ అవకాశాలను రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు.

రోహిత్ శర్మ

రోహిత్‌కు అనుకూలంగా రివ్యూ అంటూ కామెంట్లు

అంపైర్ తప్పుడు నిర్ణయంతో కోహ్లీ ఎల్బీగా వెనుదిగిరిన విషయం తెలిసిందే. ప్యాడ్, బ్యాట్‌ను బంతి ఏకకాలంలో తాకినా అంపైర్ ఔటిచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌కు కట్టుబడి థర్డ్ అంపైర్ ఔటివ్వడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. చెత్త అంపైరింగ్ అంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఔటిచ్చిన అంపైర్.. రోహిత్ కు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నేమన్(5/16) ఐదు వికెట్లతో చెలరేగగా..నాథన్ లయన్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు