మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో అత్యంత వేగంగా 25వేలు పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మార్చి 1న ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో స్వదేశంలో 4000 పరుగులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ టెస్టులో వరుసగా 44, 20 పరుగులు చేశాడు.
పది సంవత్సరాల పాటు టెస్టు క్రికెట్లో ఎన్నో మరుపురాని విజయాలను కోహ్లీ అందించాడు. స్వదేశంలో ఇప్పటివరకు 48 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3,923 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (7,216), రాహుల్ ద్రవిడ్ (5,598), సునీల్ గవాస్కర్ (5,067), వీరేంద్ర సెహ్వాగ్ (4,656) పరుగులు చేసి అతని కంటే ముందు ఉన్నారు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులివే
ప్రస్తుతం, కోహ్లి స్వదేశంలో 13 టెస్ట్ సెంచరీలను చేశాడు. ఈ విషయంలో టెండూల్కర్ (22), గవాస్కర్ (16), ద్రవిడ్ (15) సెంచరీలు చేసి అతని కంటే ముందు ఉన్నారు. స్వదేశంలో 6 డబుల్ సెంచరీలు చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు. ఛతేశ్వర్ పుజారా మూడు సెంచరీలు చేశాడు.
స్వదేశంలో 3,000కు పైగా టెస్టు పరుగులు సాధించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ఒకడు. టెండూల్కర్ స్వదేశంలో 52 టెస్టులు ఆడి 3,929 పరుగులు చేశాడు.
కోహ్లీ 180 ఇన్నింగ్స్‌లో 25వేలు పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు.