IND vs ENG: రవి బిష్ణోయ్ పేరిట చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి బౌలర్‌గా..
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న బిష్ణోయ్ బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 60 పరుగులు సమర్పించాడు. బిష్ణోయ్ పేలవ బౌలింగ్ భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు చివరి నాలుగు ఓవర్లలో 49 పరుగులు అవసరమైన సమయంలో కెప్టెన్ అతనికి 17వ ఓవర్ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ ఓవర్‌లోనే బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ వైపు మళ్లిపోయింది.
వివరాలు
అవాంఛిత రికార్డు
ఆ ఓవర్‌లో అతడు రెండు నోబాల్స్ వేయగా, వచ్చిన రెండు ఫ్రీహిట్ బంతులను ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ సిక్సర్లుగా మలిచాడు. ఇదే మ్యాచ్‌లో అంతకుముందే మరో నోబాల్ వేసిన బిష్ణోయ్, మొత్తం మూడు నోబాల్స్ నమోదు చేశాడు. దీంతో ఒకే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో మూడు నోబాల్స్ వేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ దేశానికి చెందిన బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవాంఛిత రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
వివరాలు
ఒకే ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చిన బిష్ణోయ్
అంతేకాదు, టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన భారత బౌలర్ల జాబితాలో కూడా బిష్ణోయ్ మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే ఒకే ఓవర్‌లో 34 పరుగులు ఇవ్వగా, 2016లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో స్టువర్ట్ బిన్నీ 32 పరుగులు సమర్పించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చిన బిష్ణోయ్ కూడా ఈ అవాంఛిత జాబితాలో చేరాడు.