IND vs ENG: ముగిసిన మొదటి రోజు ఆట .. టీమ్ ఇండియా స్కోర్ ఎంతంటే..?
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ముగిసింది. మ్యాచ్‌లో మొదటి రోజు స్పిన్నర్ ల హవా కొనసాగింది. స్పిన్నర్లు మొత్తం 10 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్(5/72), రవిచంద్రన్ అశ్విన్(4/51),రవీంద్ర జడేజా(17/1) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 218 పరుగులకే అల్ ఔట్ అయ్యింది. ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగి శుభారంభం చేసింది. ఆపై కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ ప్రారంభమైంది. కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ తొలి 6 వికెట్లలో 5 వికెట్లు పడగొట్టి భారీ స్కోరు దిశగా వెళుతున్న ఇంగ్లండ్ ఆశలకు గండి కొట్టాడు.
తొలిరోజు యశస్వి జైస్వాల్ ఔట్
100వ టెస్టు ఆడుతున్నవెటరన్ స్పిన్నర్ అశ్విన్, లోయర్ ఆర్డర్ లో 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (52), శుభ్‌మన్ గిల్ (26) పరుగులతో ఉన్నారు. కాగా.. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. డకెట్ (27), పోప్ (11), రూట్ (26), బెయిర్‌స్టో (29), స్టోక్స్ డకౌట్, ఫోక్స్ (24), హార్ట్లీ (6), షోయబ్ బషీర్ (11), వుడ్ డకౌట్, ఆండర్సన్ డకౌటయ్యారు.