Page Loader
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

వ్రాసిన వారు Stalin
Nov 12, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ప్రపంచ కప్‌లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్‌ తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మొదటి ఎనిమిది గేమ్‌లను గెలిచిన రోహిత్ సేన.. ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటమనేది లేకుండా నాకౌట్‌లోకి వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని ఆశిస్తోంది. ఈ స్టేడియంలో జరిగిన 42 వన్డేల్లో రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 23సార్లు గెలిచాయి.

క్రికెట్

టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు ఇవే 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటర్‌లకు అనుకూలంగా ఉంటుంది. పేసర్లకు కూడా కొంత అనుకూలించవచ్చు. ఈ స్టేడియంలో భారత్ ఆడిన 21 వన్డేల్లో 14 విజయాలు సాధించింది. టీమిండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెదర్లాండ్స్ బౌలింగ్