శ్రీలంక రెండో వన్డేలో పుంజుకునేనా..?
శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఎలాగైనా రెండో వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. రెండో వన్డే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఇప్పటివరకు అక్కడ 32 వన్డే మ్యాచ్ లు జరిగాయి. అందులో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 19సార్లు గెలిచింది. వన్డేల్లో శ్రీలంకపై భారత్ కు మంచి రికార్డు ఉంది. 2021లో జరిగిన సిరీస్‌లో భారత్ 2-1తో SLను ఓడించిన విషయం తెలిసిందే. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది
రెండో వన్డేకు జట్టు ఇదే
శ్రీలంక 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ దసున్ షనక అజేయంగా 108 పరుగులు చేశాడు. శ్రీలంక బ్యాట్‌మెన్ నిస్సాంక మంచి ఫామ్‌లో ఉన్నాడు. 11 వన్డేల్లో 49.1 సగటుతో 491 పరుగులు చేశాడు. కోహ్లీ శ్రీలంకతో ఏకంగా 9 సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈడెన్‌గార్డెన్స్‌లో 2014లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 264 పరుగులు చేసి ఆల్ టైం రికార్డు సాధించాడు భారత్ (ప్రాబబుల్ ఎలెవన్): రోహిత్‌శర్మ, గిల్, విరాట్, అయ్యర్, రాహుల్, పాండ్యా, పటేల్, షమీ, మాలిక్, సిరాజ్, చాహల్ శ్రీలంక (ప్రాబబుల్ XI): నిస్సాంక, ఫెర్నాండో, మెండిస్, డి సిల్వా, అసలంక, దసున్ షనక(c), హసరంగా, కరుణరత్నే, తీక్షణ, రజిత, మధుశంక