IND w Vs IRE w: భారత మహిళా జట్టు మరో అద్భుతమైన రికార్డు.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటిసారి వన్డేల్లో 400కంటే ఎక్కువ పరుగులు చేసింది.
కెప్టెన్ స్మృతి మంధాన 135 పరుగులు(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు)ఓపెనర్ ప్రతీకా రావల్ 154 పరుగులు (129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్)శతకాలతో అద్భుతంగా ఆడారు.
వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ 59 పరుగులు (10 ఫోర్లు, 1 సిక్స్)తో దూకుడుగా ఆడింది.దీంతో టీమ్ ఇండియాకు అత్యధిక స్కోరు 435/5 చేసింది
ప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఐర్లాండ్‌పైనే జనవరి 12న చేయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది.
వివరాలు
వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం
స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తన కెరీర్‌లో పదో శతకాన్ని 70 బంతుల్లో పూర్తి చేసింది, ఇది భారత మహిళా జట్టు తరఫున అత్యంత వేగంగా చేసిన శతకం.
ఆమె గత వన్డేలో కూడా శతకం సాధించినది. ప్రతీకా రావల్ తన తొలి సెంచరీని 100 బంతుల్లో సాధించింది. మంధాన-ప్రతీకా జోడీ 233 పరుగులు చేసి మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.
స్మృతి సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడింది, 10 బంతుల్లో 35 పరుగులు చేసిన తరువాత 80 బంతుల్లో 135 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరింది.
వివరాలు
బాదుడే లక్ష్యంగా రిచా ఘోష్
ప్రతీకా రావల్ కూడా తన శతకాన్ని సాధించిన తర్వాత మరింత ఉత్సాహంగా ఆడింది, 27 బంతుల్లో అర్ధశతకం సాధించింది.
రిచా ఘోష్ కూడా బాదుడే లక్ష్యంగా ఆడింది. దీంతో ప్రతీకా-రిచా జోడీ 12 ఓవర్లలో 104 పరుగులు చేయడమే కాకుండా, తేజల్ హసబ్నిస్ (28) హర్లీన్ డియోల్ (15) కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా రెండు వికెట్లు తీసినా, కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ ఒక్కో వికెట్ తీయగలిగారు.