LOADING...
India A: భారత్‌-ఎ ఘన విజయం.. శ్రీలంక-ఎపై 10 వికెట్లతో టెస్టు సిరీస్‌ సొంతం
భారత్‌-ఎ ఘన విజయం.. శ్రీలంక-ఎపై 10 వికెట్లతో టెస్టు సిరీస్‌ సొంతం

India A: భారత్‌-ఎ ఘన విజయం.. శ్రీలంక-ఎపై 10 వికెట్లతో టెస్టు సిరీస్‌ సొంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్‌ను భారత్‌-ఎ 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటిన భారత్‌-ఎ 10 వికెట్ల తేడాతో శ్రీలంక-ఎను చిత్తుగా ఓడించింది. మ్యాచ్‌ చివరిదైన నాలుగో రోజు ఆదివారం, తొలి ఇన్నింగ్స్‌లో 177పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక-ఎ ఎక్కువసేపు నిలవలేక 209పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన గుర్నూర్‌ బ్రార్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరింత పదునైన బౌలింగ్‌తో చెలరేగి 68 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి అద్భుత ప్రదర్శనతో శ్రీలంక-ఎ బ్యాటింగ్‌ కుప్పకూలింది. లంక బ్యాటర్లలో అషెన్‌ బండార ఒక్కరే ప్రతిఘటిస్తూ 87 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

వివరాలు 

రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకున్న భారత్‌-ఎ

దీంతో భారత్‌-ఎ ముందుంచిన లక్ష్యం కేవలం 33 పరుగులే కావడంతో, భారత ఓపెనర్లు ఎలాంటి వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 541/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌-ఎ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌-ఎ 543 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు శ్రీలంక-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకే పరిమితమైంది. కాగా, ఈ సిరీస్‌లో తొలి అనధికార టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో సాధించిన ఘన విజయంతో భారత్‌-ఎ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది.

Advertisement