Duleep Trophy: దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ'
దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ' నిలిచింది. ఇండియా 'సీ' పై 132 పరుగుల తేడాతో ఇండియా 'ఏ' గెలిచింది. ఈ విజయంతో ఇండియా 'ఏ' పాయింట్ల పట్టికలో రెండు విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 350 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 'సీ' 217 పరుగులకు ఆలౌటైంది.
సాయి సుదర్శన్ సెంచరీ వృథా
తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన ఇండియా 'ఏ', రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. లక్ష్య చేధనలో ఇండియా 'సీ' కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 44 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 111 పరుగులు చేశారు. ఇక ఇషాన్ కిషన్ 17 పరుగులు, రజత్ పటిదార్, అభిషేక్ ఫోరెల్ నిరాశ పరిచారు. ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.