Page Loader
IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్
IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికాపై ఆలౌట్

IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

వ్రాసిన వారు Stalin
Nov 05, 2023
08:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అల్లాడించడంతో 243 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో భారత్ వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 326 పరుగులను చేసింది. బర్త్ డే బాయ్ కోహ్లీ సెంచరీతో రాణించాడు. 327 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ప్రోటీస్‌ టీమ్‌ను భారత బ్యాటర్లు 82 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం ద్వారా వరుస నాలుగు విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికాకు బ్రేక్ పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

243 తేడాతో భారత్ విజయం