LOADING...
IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యం.. పాక్‌కు మరో పరీక్ష!
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యం.. పాక్‌కు మరో పరీక్ష!

IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిపత్యం.. పాక్‌కు మరో పరీక్ష!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీమిండియాతో ఆడమని తొలుత హెచ్చరించిన పాకిస్థాన్, ఐసీసీ జోక్యంతో తన వైఖరిని మార్చుకుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం సహజం. కొన్ని రోజుల ముందే చర్చలు మొదలవుతాయి. పాక్ బహిష్కరణ డ్రామా తర్వాత ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు మరింత క్రేజ్ సంపాదించింది.

Details

ప్రపంచకప్‌లో భారత్ ఆధిపత్యం

ఆదివారం జరగబోయే ఈ సమరం నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు ఎలా ఉందో పరిశీలిస్తే... ఇప్పటివరకు జరిగిన తొమ్మిది టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 2007లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో భారత్ ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్థాన్ 2021లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఓవరాల్ టీ20 రికార్డు మొత్తం టీ20ల్లో భారత్-పాక్ జట్లు 16 సార్లు ముఖాముఖి కాగా, భారత్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్థాన్ మూడుసార్లు మాత్రమే విజయం సాధించింది.

Details

2007లో రెండు విజయాలు, తొలి టైటిల్

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండింటిలోనూ విజయం భారత్‌దే. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమ్ఇండియా తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024లో తక్కువ స్కోరు రక్షణ 2024 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 119 పరుగులకే ఆలౌటైంది. అయినప్పటికీ బుమ్రా (3/14), హార్దిక్ (2/24) అద్భుత బౌలింగ్‌తో లక్ష్యాన్ని కాపాడుకుని ఆరు పరుగుల తేడాతో గెలిచింది. కొలంబో జ్ఞాపకాలు 2012 టీ20 ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే వేదికపై మరోసారి ఈ దాయాదుల పోరు జరగనుంది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో టీమ్ఇండియా ఉంది.

Advertisement