ఆసియా క్రీడల వైపు భారత్ చూపు.. నేటి నుంచే హాకీ సిరీస్
ఆసియా క్రీడల సన్మాహమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అయిదు మ్యాచ్ ల సిరీస్ గురువారం ప్రారంభకానుంది. సీనియర్ గోల్ కీపర్ సవిత నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. వైఎస్ కెప్టెన్ గా డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహరించనుంది. తొలి మూడు మ్యాచుల్లో సీనియర్ జట్టుతో, తర్వాత మ్యాచుల్లో ఆసీస్ -ఎ బృందంతో భారత్ ఢీ కొట్టనుంది. గురువారం తొలి మ్యాచ్ మొదలు కానుంది. ఈనెల 20, 21, 25, 27 తేదీల్లో వరుసగా తర్వాతి మ్యాచ్ లు జరుగనున్నాయి.
సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ చైనాలోని హాంగ్ జౌలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇటీవలే బల్బీర్ సింగ్ సీనియర్ హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2022) అవార్డుకు సవిత ఎంపికైన విషయం తెలిసిందే. నిక్కీ ప్రధాన్, ఇషికా చౌదరి, ఉదిత, గుర్జిత్ కౌర్‌లతో కూడిన జట్టులో బిచు దేవి ఖరీబామ్ రెండవ గోల్ కీపర్‌గా ఉండనుంది. నిషా, నవజోత్ కౌర్, మోనికా, సలీమా టెటే, నేహా, నవనీత్ కౌర్, సోనికా, జ్యోతి, బల్జిత్ కౌర్ మిడ్‌ఫీల్డర్లుగా ఉంటారు