గుడ్‌న్యూస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఫలితం లేకుండానే టీమిండియా గుడ్‌న్యూస్ అందింది. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించింది. 121 పరుగులతో అజేయంగా నిలిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డారెల్ మిచెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 86 బంతుల్లో 81 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌కు 8 పరుగులు అవసరం కాగా, ఆఖరి బంతికి న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్
2021లో టీమిండియా ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించే అవకాశం టీమిండియాకు దక్కింది ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌లోని ఓవెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ కోసం బిగ్ ఫైట్ జరగనుంది. 2021లో మిస్ అయిన టెస్టు గదను ఈ సారి ఎలాగైన సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా-ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.