IND vs AUS: గిల్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాణిస్తున్న బ్యాటర్లు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. ఛతేశ్వర్ పుజారా(42)తో కలిసి శుభ్‌మన్ గిల్ (128) అద్భుతంగా రాణించారు. విరాట్ కోహ్లీ (59) హాఫ్ సెంచరీతో మెరవడంతో మూడో ఆట ముగిసే సమయానికి భారత్ 99 ఓవర్లో 289 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీతో పాటు జడేజా(16) ఉన్నాడు. ఓవర్ నైట్ స్కోరు 36/0తో బ్యాటింగ్ కు దిగిన భారత్‌ను రోహిత్ శర్మ (35), గిల్ లు ముందుకు నడిపించారు. అయితే రోహిత్‌శర్మ లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశ పరిచాడు. లంచ్ సమయానికి గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే పుజారా(42) అవుట్ కావడంతో కోహ్లీ వచ్చి నిలకడగా పరుగులు రాబట్టాడు.
భారత ప్లేయర్లు సాధించిన రికార్డులు
గిల్ టెస్టులో తన రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై గిల్ తొలి టెస్టు సెంచరీ సాధించారు. సురేశ్ రైనా, రోహిత్, కేఎల్ రాహుల్ తర్వాత మూడు ఫార్మాట్‌లలో ఏడాది వ్యవధిలో సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగులు చేసిన పూర్తి చేసిన భారత ఏడో ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై పుజారా 2,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. స్వదేశంలో 4000 టెస్టు పరుగులు చేసిన ఐదోవ భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.