అంతర్జాతీయ క్రికెట్లో హిట్‌మ్యాన్ కొత్త రికార్డు
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ కొత్త రికార్డును సృష్టించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా (ఓవరాల్ గా 28వ క్రికెటర్‌గా) నిలిచాడు. ఇంకొ 78 పరుగులు సాధిస్తే ఎంఎస్ ధోనిని అధిగమించి ఈ జాబితాలో ఐదోస్థానానికి చేరుకుంటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 58 బంతుల్లో 35 పరుగులు చేసి ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మెట్స్‌లో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ (34 357 రన్స్) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు.
రోహిత్ శర్మ సాధించిన రికార్డులివే
రోహిత్ 438 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 42.85 సగటుతో 17,014 పరుగులు చేశాడు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (25,047), రాహుల్ ద్రవిడ్ (24,208), సౌరవ్ గంగూలీ (18,575), ఎంఎస్ ధోనీ (17,266), వీరేంద్ర సెహ్వాగ్ (17,253) అంతర్జాతీయ పరుగుల పరంగా రోహిత్ కంటే ముందుస్థానంలో నిలిచారు. రోహిత్ శర్మ 49 టెస్టులు మ్యాచ్‌లో 45.66 సగటుతో 3,379 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలను బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో అతను 40.33 సగటుతో 242 పరుగులు చేశాడు. ఆసీస్‌తో అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 35 పరుగులు చేసి మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.