రవిశాస్త్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ
ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మూడో టెస్టులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ముఖ్యంగా అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు. దీనిపై తాజాగా రోహిత్ శర్మ స్పందించారు. బయట వ్యక్తులు చేసే చెత్త వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిజాలు తెలుసుకుంటే తొలి టెస్టులో తాము గెలిచామని, బయట వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు చాలా చెత్తగా ఉన్నాయని రోహిత్ మండిపడ్డారు. ప్రతి మ్యాచ్ గెలవడానికే తాము కృషి చేస్తామన్నారు.
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోలేదు
ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే తాము మూడో టెస్టు ఓడిపోయామన్నది పూర్తిగా అబద్దమని రోహిత్ అన్నాడు. ప్లేయర్ల ఆటతీరు డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తే ఒకేలా ఉంటుందని, బయటి నుంచి మరోలా కనిపిస్తుందని పేర్కొన్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి మ్యాచ్‌లో దూకుడుగా ఆడటానికే ప్రయత్నిస్తుంటామని, అది కొన్నిసార్లు వర్కవుట్ కాకపోవచ్చని రోహిత్ వివరించాడు. ఆటగాళ్ల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయో బయటి వాళ్లకు తెలియదన్నారు. రవిశాస్త్రికి డెస్సింగ్ రూమ్‌లలో ఉండే ఆటగాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసునంటూ తెలియజేశారు.