బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్
అహ్మదాబాద్ టెస్టును గెలవాలని టీమిండియా శ్రమిస్తోంది. ఇండోర్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి ఐసీసీ టెస్టు చాంఫియన్ షిప్‌కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది. కాగా, టీమ్ భారత టీం బస్సులోనే హోలీ సంబరాలు చేసుకున్నారు. భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హోలీ వేడుకల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో నాల్గవ, చివరి టెస్టుకు ముందు నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్తున్న బస్సులో భారత క్రికెట్ జట్టు హోలీ ఆడింది. ఆటగాళ్లు ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు. గిల్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ ముందంజలో హోలీ సంబరాలు చేసుకుంటున్నాడు. కమ్ డౌన్, రాంగ్ బర్సే పాటలపై డ్యాన్స్ చేస్తున్నాడు
మార్చి 9న చివరి టెస్టు
కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్‌తో సహా జట్టులోని ఆటగాళ్లందరూ రంగులు పూసుకుని ఉన్నారు. భారత జట్టు హోలీ జరుపుకుంటున్న వీడియోను కూడా ఇషాన్ కిషన్ పంచుకున్నాడు. అందులో ఆటగాళ్లందరూ కేకలు వేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో ముందంజలో ఉంది.