Page Loader
భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ
మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనున్న చైన్నై సూపర్ కింగ్స్

భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2023
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలారోజుల తర్వాత మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్సర్ చూసే భాగ్యం చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు లభించింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాయి. అందులో భాగంగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు కూడా చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. చైన్నై కెప్టెన్ ఎమ్మెస్ ధోని రోజూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా గురువారం అతడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చైన్నై ఫ్రాంఛైజీ తన ట్విట్టర్ ఆకౌంట్లో పోస్టు చేసింది. తలా అప్‌డేట్ అనే క్యాప్షన్‌తో చైన్నై టీం ఈ వీడియోను షేర్ చేసింది.

ధోని

మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం

ఇందులో ధోని బాదిన సిక్సర్ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ తలైవా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో అతని ఆట చూసే అవకాశం ఈ మెగా లీగ్ లోనే దక్కనుంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆడి గుడ్ బై చెప్పాలని భావిస్తున్న ధోని.. చివరిసారిగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కప్పు తెచ్చేందుకు నెట్స్ లో శ్రమిస్తున్నాడు. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తో చెన్నై తలపడనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్సర్‌తో దుమ్ములేపిన మహేంద్ర సింగ్ ధోని