Page Loader
INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ
చివరి టెస్టులో సెంచరీ సాధించిన గిల్

INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజృంభించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అతను.. తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(35)తో కలిసి మొదటి వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత పుజారా (42)తో కలిసి గిల్ తన ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌పై ఓపెనర్ గిల్ 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో స్వదేశంలో తన మొదటి టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గిల్ గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

గిల్

ఈ ఏడాది ఫామ్‌లో ఉన్న గిల్

ఈ ఏడాది శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఈ సంవత్సరం 890కి పైగా పరుగుల చేసి సత్తా చాటాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచిన విషయం తెలిసిందే. ఏదేమైనా గిల్ సెంచరీతో భారత జట్టు కూడా ఆసీస్ చేసిన స్కోరుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ 228 పరుగులకు రెండు వికెట్లను నష్టపోయింది. క్రీజులో గిల్ (124) విరాట్ కోహ్లీ (19) ఉన్నారు. ఇంకా భారత్ 252 పరుగుల వెనుకంజలో నిలిచింది.