Loading...
Cricket World Cup 2027: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి ప్రత్యర్థి ఆసీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి ప్రత్యర్థి ఆసీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Cricket World Cup 2027: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి ప్రత్యర్థి ఆసీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వచ్చే ఏడాది అక్టోబరు 7న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. ప్రధాన టోర్నీలో ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత్‌ గ్రూప్‌-ఎలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్‌-ఎ జట్లతో కలిసి ఉంది. టీమ్‌ఇండియా అక్టోబరు 10న జొహానెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబరు 14న అఫ్గానిస్థాన్‌తో, అక్టోబరు 17న క్వాలిఫయర్‌-ఎ జట్టుతో మ్యాచ్‌ ఆడుతుంది. భారత్‌ తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో అక్టోబరు 24న జింబాబ్వేతో పోటీ పడనుంది. ఇక దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్‌-బి జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి.

వివరాలు

నవంబరు 21న ఫైనల్

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌.. అక్టోబరు 2న నమీబియాలో ప్రారంభమవుతుంది.

మూడు జట్ల సూపర్‌ సిరీస్‌తో టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు. నవంబరు 17, 18 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. కేప్‌టౌన్‌, తిష్వానె నగరాలు సెమీఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

నవంబరు 21న జొహానెస్‌బర్గ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ పోటీలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు జరుగుతాయి.

ఈ క్వాలిఫయర్‌లో విజేత ప్రపంచకప్‌ ప్రధాన టోర్నీలోని 12 జట్ల దశకు నేరుగా అర్హత సాధిస్తుంది.

ఈ టోర్నీలో రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచే జట్లు ప్రపంచకప్‌ తొలి రౌండ్‌లో పోటీపడతాయి. ఈ తొలి రౌండ్‌ పోటీలనే 'సూపర్‌ సిరీస్‌'గా పిలుస్తారు.

ADVERTISEMENT