Asian Games: భారత్ పతకాల వేట షురూ.. ఆసియా క్రీడల్లో అదరగొడుతున్న అథ్లెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడల్లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అథ్లెటిక్స్‌లో తొలి రోజే భారత్‌కు ఓ రజతం, ఓ కాంస్యం లభించడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. వుషులో ఓ రజతం, రోయింగ్‌లో ఓ కాంస్యం కూడా దక్కాయి. అయితే పతకాల పంట పండుతుందని భావించిన షూటింగ్‌లో మాత్రం నిరాశాజనక ప్రదర్శన కొనసాగింది. స్కీట్ విభాగంలో ఓ కాంస్యం దక్కినప్పటికీ.. షూటింగ్‌లో పసిడి కోసం భారత్ నిరీక్షణకు తెరదించుతారని భావించిన ఎయిర్ పిస్టల్ షూటర్లు కనీసం ఓ పతకాన్ని కూడా సాధించలేకపోయారు. మిగతా క్రీడల్లో భారత క్రీడాకారులు పర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు.
వివరాలు
అథ్లెటిక్స్‌లో ఆశాజనక ఆరంభం
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగాన్ని భారత క్రీడాకారులు ఆశాజనకంగా ప్రారంభించారు. గురువారం జరిగిన పరుగు పోటీల్లో భారత్‌కు ఓ రజతం, ఓ కాంస్యం లభించాయి.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో పూవమ్మ రాజు, విశాల్ తెన్నరసు, విద్య రామ్‌రాజ్, మను టీఎస్‌లతో కూడిన భారత బృందం చక్కటి ప్రదర్శన చేసి రజత పతకం సాధించింది.
భారత జట్టు 3 నిమిషాల 14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించింది.
కాంస్యం సాధించిన వియత్నాం జట్టు 3:14.54 సెకన్లలో రేసును పూర్తి చేసింది. భారత్, వియత్నాం మధ్య తేడా కేవలం 0.08 సెకన్లు కావడం విశేషం.
వివరాలు
4×400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుస్తాం
చివరగా బ్యాటన్ అందుకున్న విద్య రామ్‌రాజ్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌కు రజతం దక్కింది.
2018 ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు భారత్ స్వర్ణం గెలిచింది. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించింది.
ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగామని, అయితే బహ్రెయిన్ గట్టి పోటీ ఇచ్చి పసిడి పతకాన్ని సొంతం చేసుకుందని పూవమ్మ రాజు తెలిపింది.
మహిళల 4×400 మీటర్ల రిలేలో మాత్రం స్వర్ణం గెలిచి తీరుతామని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
వివరాలు
10 వేల మీటర్లలో సీమ కుమారికి కాంస్యం
మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమ కుమారి కాంస్య పతకం సాధించడం అనూహ్యంగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో భారత్ పతకం సాధించి 16 ఏళ్లు అవుతోంది.
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సీమ.. 32 నిమిషాల 50.05 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.
విన్‌యావి 32:39.18 సెకన్లతో స్వర్ణం, టనాక 32:41.54 సెకన్లతో రజతం గెలుచుకున్నారు.
మొత్తంగా మహిళల 10 వేల మీటర్ల పరుగులో భారత్‌కు లభించినది ఇది మూడో ఆసియా క్రీడల పతకం.
వివరాలు
త్రుటిలో పతకం చేజార్చుకున్న ఆశా ఇలంగో
మహిళల ట్రిపుల్ జంప్‌లో ఆశా ఇలంగో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఆశా 13.83 మీటర్ల దూరం దూకగా.. చైనా అథ్లెట్ యి లి కూడా 13.83 మీటర్ల దూరాన్నే నమోదు చేసింది.
అయితే రెండో ఉత్తమ జంప్‌లో యి లి 13.79 మీటర్లు నమోదు చేయగా.. ఆశా ఇలంగో 13.65 మీటర్ల ప్రదర్శనతో సరిపెట్టుకుంది.
దీంతో పతకం యి లికి దక్కగా.. ఆశా పతకానికి దూరమైంది.
వివరాలు
రోయింగ్‌లో సత్నాం-సల్మాన్‌కు కాంస్యం
రోయింగ్‌లో సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ భారత్ పరువు నిలిపింది. కనీసం ఐదు పతకాలు సాధిస్తుందని అంచనాలతో ఆసియా క్రీడల్లోకి అడుగుపెట్టిన భారత రోయింగ్ బృందానికి ఈసారి కేవలం ఒకే పతకం లభించింది.
గురువారం పురుషుల డబుల్ స్కల్స్‌లో సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల డబుల్ స్కల్స్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.
ఫైనల్‌లో చివరి 500 మీటర్ల సమయంలో భారత ద్వయం మూడో స్థానానికి పడిపోయింది.
తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న సత్నాం, సల్మాన్ జంట.. ఫైనల్‌ను 6 నిమిషాల 13.25 సెకన్లలో పూర్తి చేసింది.
వివరాలు
భారత జట్టు పేలవ ప్రదర్శన
చైనాకు చెందిన యి జుని-యిడె నై జోడీ 6:09.37 సెకన్లతో స్వర్ణం సాధించగా.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సోరిన్-మెక్రోజ్బెక్ జంట 6:10.49 సెకన్లతో రజతం గెలుచుకుంది.
ఆసియా క్రీడల రోయింగ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
1982లో ఆసియా క్రీడల్లో రోయింగ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ కేవలం ఒక పతకానికే పరిమితమైన సందర్భం ఇది నాలుగోసారి.
1982, 1994, 2002 ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు ఒక్కో పతకమే లభించింది. 2010, 2023 ఆసియా క్రీడల్లో మాత్రం భారత్ అత్యధికంగా ఐదేసి పతకాలు సాధించింది.
వివరాలు
రోయింగ్ జట్టు ఎంపికపై వివాదం
వివిధ విభాగాల్లో పోటీపడే క్రీడాకారుల ఎంపికపై తలెత్తిన వివాదం జట్టు ప్రదర్శనను దెబ్బతీసినట్లు సమాచారం.
పోటీలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే క్రీడాకారులు ఎంపికపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ విభాగాలను మార్చారని, రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న వారిని ప్రధాన జట్టులో చేర్చారని వారు విమర్శించారు.
తన భాగస్వామిని పోటీకి కేవలం ఐదు రోజుల ముందు మార్చారని, అలా జరగకుండా ఉంటే తాము మరింత మెరుగైన ప్రదర్శన చేసేవాళ్లమని కాంస్య పతక విజేత సత్నాం సింగ్ తెలిపాడు.
గత ఆసియా క్రీడల్లో సత్నాం క్వాడ్రాపుల్ స్కల్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. 28 ఏళ్ల సత్నాం తొలుత జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నాడు.
వివరాలు
స్క్వాష్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు అనాహత్, తన్వి
మాజీ ఒలింపియన్ స్వర్ణ్ సింగ్ విర్క్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం రోయింగ్‌లోకి అడుగుపెట్టాడు. స్క్వాష్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు.
మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్ అనాహత్ సింగ్, తన్వి ఖన్నా.. పురుషులసింగిల్స్‌లో అభయ్ సింగ్, వీర్ చోత్రాని క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చినప్ప, సెంథిల్ కుమార్ జోడీ కూడా తుది ఎనిమిది మందిలో చోటు సంపాదించింది.
జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అనాహత్ సింగ్ 3-0(11-4, 11-5, 11-7)తో సింగపూర్‌కు చెందిన వెయ్ లిన్ యు యియాంగ్‌ను కేవలం 19నిమిషాల్లో ఓడించింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె తన సహచరిణి తన్వి ఖన్నాతో తలపడనుంది.
తన్వి ఖన్నా 3-1(5-11, 11-4, 11-5, 13-11)తో సింగపూర్‌కు చెందిన వెయ్ యాన్ యు యియాంగ్‌పై విజయం సాధించింది.
వివరాలు
ఒకరు సెమీఫైనల్ కు చేరడం ఖాయం
దీంతో అనాహత్, తన్విలలో ఒకరు సెమీఫైనల్‌కు చేరడం ఖాయమైంది.
అయితే స్క్వాష్‌లో ఈసారి మూడో స్థానం కోసం కూడా పోటీ నిర్వహించనున్న నేపథ్యంలో.. భారత్‌కు పతకం ఖాయమైందని మాత్రం చెప్పలేం.
పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ 3-0 (11-5, 11-6, 11-0)తో శ్రీలంకకు చెందిన రవిందు లక్‌సిరిపై విజయం సాధించాడు.
వీర్ చోత్రాని 3-2 (11-9, 8-11, 11-6, 15-17, 11-6)తో మలేసియాకు చెందిన సంజయ్ జీవను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చినప్ప, సెంథిల్ కుమార్ జోడీ 11-7, 11-10తో భారత్‌కే చెందిన సూరజ్ చంద్, షమీనా రియాజ్ జంటపై విజయం సాధించి ముందంజ వేసింది.
వివరాలు
టేబుల్ టెన్నిస్‌లో ప్రిక్వార్టర్స్‌కు భారత జోడీలు
టేబుల్ టెన్నిస్‌లో భారత జోడీలు ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాయి.
మహిళల డబుల్స్‌లో శ్రీజ, సిండ్రెలా దాస్ జంట 3-0 (11-5, 11-4, 12-10)తో మంగోలియాకు చెందిన బురెన్‌జర్గాల్ సంజా, బొలార్ ఎర్డీన్ జంటపై విజయం సాధించింది.
యశశ్విని, దియ జంట 3-0 (11-2, 11-2, 11-4)తో ఇరాన్‌కు చెందిన సెతాయిష్, మహ్‌షిద్ జోడీని ఓడించింది.
పురుషుల సింగిల్స్‌లో మనుష్ షా, మానవ్ థక్కర్ రెండో రౌండ్‌లో విజయాలు నమోదు చేశారు.
ఫెన్సింగ్‌లో ముగిసిన భారత పోరాటం
ఫెన్సింగ్‌లో భారత్ పతకం లేకుండానే పోటీని ముగించింది. భవాని దేవి, శ్రేయ గుప్తా మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోనే ఓటమి పాలయ్యారు.
వివరాలు
హాకీలో భారత్ జోరు
హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జోరును కొనసాగిస్తోంది. కొరియాపై 8-2తో ఘన విజయం సాధించింది.
దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు 10వ, 26వ, 32వ నిమిషాల్లో గోల్స్ చేశాడు.
అభిషేక్ 15వ, 38వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. షిలానంద్ 4వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 11వ నిమిషంలో, రాజిందర్ 60వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు.
లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయం.
వివరాలు
సాక్షి చౌదరికి నిరాశ
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరి.. ఆసియా క్రీడల్లో మాత్రం పతకం సాధించలేకపోయింది.
మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో హోరాహోరీగా సాగిన పోరులో సాక్షి 2-3తో కజకిస్థాన్‌కు చెందిన అలువ బల్కిబెకోవా చేతిలో ఓటమి పాలైంది.
పురుషుల 70 కిలోల విభాగంలో సుమిత్ గాయం కారణంగా పోటీలో పాల్గొనలేదు.
మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపిన ప్రణతి నాయక్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
వివరాలు
రోషిబినాకు మళ్లీ రజతమే
మణిపురి క్రీడాకారిణి నోరెమ్ రోషిబినా బంగారు కల మరోసారి నెరవేరలేదు. ఆసియా క్రీడల్లో ఇప్పటికే కాంస్యం, రజతం గెలిచిన రోషిబినా.. మూడో ప్రయత్నంలోనూ స్వర్ణ పతకాన్ని అందుకోలేకపోయింది.
గురువారం జరిగిన మహిళల 60 కిలోల వుషు ఫైనల్లో రోషిబినా 0-2తో చైనాకు చెందిన జాంగ్ జియాయు చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.
మ్యాచ్‌లో ఏ దశలోనూ రోషిబినా తన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దూకుడుగా ఆడిన చైనా ప్లేయర్ సైడ్ కిక్‌లతో రోషిబినాపై ఆధిపత్యం ప్రదర్శించింది.
2018 ఆసియా క్రీడల్లో రోషిబినా కాంస్య పతకం సాధించింది. 2023లో రజతం గెలుచుకుంది. ఇప్పుడు వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకం సాధించినప్పటికీ.. స్వర్ణం మాత్రం అందుకోలేకపోయింది.
వివరాలు
స్వర్ణం అందించలేకపోయాం
మ్యాచ్ అనంతరం రోషిబినా మాట్లాడుతూ.. ఈసారి కూడా రజతమే గెలిచానని, భారత ప్రజలకు స్వర్ణం అందించలేకపోయానని తెలిపింది.
తాను గందరగోళ పరిస్థితుల్లో ఆసియా క్రీడలకు వచ్చానని, సెప్టెంబర్ 10న జట్టులో ఎంపికైన విషయం తెలుసుకున్న వెంటనే ఇంటి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేశానని చెప్పింది.
సన్నాహాలకు తగినంత సమయం లభించలేదని పేర్కొంది. తన కోచ్ మద్దతుతో వరుసగా మూడో ఆసియా క్రీడల్లో పతకం గెలవగలిగానని తెలిపింది.
సెలక్షన్ ట్రయల్స్‌లో రోషిబినాను ఓడించిన దివ్యాంశి చౌదరి గాయపడటంతో.. ఆసియా క్రీడలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఆమె స్థానంలో రోషిబినాను జట్టులోకి చేర్చిన విషయం తెలిసిందే.
వివరాలు
కబడ్డీలో సెమీఫైనల్‌కు భారత జట్లు
కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. పురుషుల జట్టు 37-21తో చైనీస్ తైపీని చిత్తు చేసి గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో భారత్ అజేయంగా గ్రూప్ దశను ముగించింది. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయాలు సాధించింది.
1980లో ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ క్రీడలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 9 పతకాలు సాధించింది.
2018ఆసియా క్రీడల్లో కాంస్య పతకం మినహా మిగతా అన్ని ఆసియా క్రీడల్లోనూ భారత్ స్వర్ణ పతకాలనే గెలుచుకుంది. మహిళల కబడ్డీలోనూ భారత్ జోరు కొనసాగింది.
భారత జట్టు32-13తో జపాన్‌ను చిత్తు చేసింది. దీంతో గ్రూప్ దశలో మహిళల జట్టు కూడా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది.