Page Loader
Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే

Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టులో అన్‌క్యాప్డ్ యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లకు ముగ్గురు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లను తీసుకోవడం గమనార్హం. ఇషాన్‌ కిషన్‌తో పాటు మహ్మద్‌ షమీ కూడా గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కగా, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ తన బెర్తను కోల్పోయాడు. వాస్తవానికి డిసెంబర్‌లో భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది.

టెస్టు

ఇంగ్లాండ్, టీమిండియా జట్లు ఇవే 

టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్. ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫాక్స్, టామ్ హార్ట్‌లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్ ., జో రూట్, మార్క్ వుడ్.