BCCI: రాజ్‌కోట్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో టెస్టు ఆడుతోంది.
అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిశాక.. స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు నుంచి వైదొలిగాడు.
ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు.
ఈ క్రమంలో అశ్విన్ మళ్లీ జట్టులోకి వచ్చినట్లు, మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది.
రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనం టీమ్ ఇండియాకు రిలీఫ్ న్యూస్ అని చెప్పాలి.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశ్విన్ రీ ఎంట్రీ
🚨 UPDATE 🚨: R Ashwin set to rejoin #TeamIndia from Day 4 of the 3rd India-England Test.#INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/rU4Bskzqig
— BCCI (@BCCI) February 18, 2024