Loading...
IND vs SL: భారత్‌కు ఎదురుందా?.. శ్రీలంకతో రెండో టెస్టు నేటి నుంచే
భారత్‌కు ఎదురుందా?.. శ్రీలంకతో రెండో టెస్టు నేటి నుంచే

IND vs SL: భారత్‌కు ఎదురుందా?.. శ్రీలంకతో రెండో టెస్టు నేటి నుంచే

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక పర్యటనను ఘన విజయంతో ప్రారంభించిన టీమిండియా.. మరో సమరానికి సిద్ధమైంది. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ బృందం.. ఇప్పుడు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. మూడేళ్ల తర్వాత విదేశీ గడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచినట్లవుతుంది.

వివరాలు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి వెళ్తుందా?

సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమ్‌ఇండియా.. కొలంబోలో శ్రీలంకను ఢీకొననుంది.

గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.

మరోవైపు భారత బ్యాటర్లను స్పిన్‌ ఉచ్చులో బిగించాలని చూసిన శ్రీలంకకు మన బ్యాటర్లు దీటుగా బదులిచ్చారు.

తొలి టెస్టులో విజయం సాధించడంతో ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది.

దీంతో రెండో టెస్టులో భారత జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంటుంది.

వివరాలు

గిల్‌, జైస్వాల్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలి..

తొలి టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన టీమ్‌ఇండియా.. అదే జోరును రెండో టెస్టులోనూ కొనసాగించాలని భావిస్తోంది.

ముఖ్యంగా బ్యాటింగ్‌లో భారత్‌ బలంగా కనిపిస్తోంది. అయితే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది.

గిల్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. తన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు.

అయితే స్పిన్‌ బౌలింగ్‌లో, ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బందిపడుతున్నాడు.

గాలె టెస్టులోనూ ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో రెండుసార్లు గిల్‌ ఔటయ్యాడు.

దీంతో రెండో టెస్టులో తన బలహీనతను అధిగమించాలని గిల్‌ భావిస్తున్నాడు.

ADVERTISEMENT